ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం..!!

గోదావరిఖని:
అర్జున్ సమాచారం:

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్ ” కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీరామచంద్ర మిషన్‌లోని శివాలయం, హనుమాన్ ఆలయాల లోని పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని కార్యక్రమ ఇంచార్జీ జిల్లా లేబర్ సెల్ కో కన్వీనర్
ఎల్తురీ రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు….

లక్ష్మీ నగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ పర్యవేక్షణలో నిర్వహించిన  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు  కందుల సంధ్యారాణి హాజరయ్యారు….

ఆలయ పరిసరాల్లో పెరిగిన పిచ్చి చెట్లు, చెత్తాచెదారం తొలగించి ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఆలయ పరిసరాలను శుభ్రపరచడంతో పాటు విగ్రహాలను కూడా శుద్ధి చేసి, భక్తులకు ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు “సేవా సంకల్ప అభియాన్ ”లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు…
ప్రజలకు సంక్షేమం, అభివృద్ధితో పాటు స్వచ్ఛత, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

“స్వచ్ఛ భారత్” అనే నరేంద్ర మోదీ గారి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు…

అంత్యోదయ స్ఫూర్తితో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంతో పాటు, అభివృద్ధి చెందిన భారతదేశం “వికసిత్ భారత్” లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ముందుకు సాగుతున్నారని, ఆ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో   బిజెపి లేబర్ సెల్ పెద్దపెల్లి జిల్లా కన్వీనర్  తడగొండ నరసయ్య ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మచ్చ విశ్వాస్ బిజెపి పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరిత లేబర్ సెల్ కో కన్వీనర్ చిలుముల నరేందర్ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు జక్కుల పద్మ బీజేపీ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్, జక్కుల ప్రవీణ్ గజ్జల భాస్కర్, జక్కన బాలు, సిలారపు కళ్యాణ్, బెక్కం స్వప్న,బుంగ మహేష్, అక్కపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
=======================